
తెలంగాణ సీఎం కేసీఆర్ ఈగో పర్సన్ అన్నారు సినీ నటి, బీజేపీ నేత కుష్బూ. ఒక లీడర్కు ఈగో ఉండకూడదని ఆమె తెలిపారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గోనడం సంతోషంగా ఉందన్నారు కుష్బూ. రాజకీయపరంగా ఎలాంటి విభేదాలున్నా.. ప్రధాని వచ్చినప్పుడు రాష్ట్ర సీఎంగా ఆయనను రిసీవ్ చేసుకోవడం సంస్కారమన్నారు. తెలంగాణలో 2023లో బీజేపీ కచ్చితంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. అటు వచ్చే ఎన్నికల్లో తమిళనాడులో కూడా బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోడీ హైదరాబాద్ కు రానున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన మధ్యాహ్నం12.45 నిమిషాలకు బయలుదేరి మధ్యాహ్నం 2. 55 నిమిషాలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకోనున్నారు.