V6 News

ఫుట్బాల్ ఆటకు ప్రజా ధనమా? : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

 ఫుట్బాల్ ఆటకు ప్రజా ధనమా?  : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: 5 నిమిషాల ఆట కోసం వందల కోట్ల ప్రజాధనాన్ని తగలేస్తరా? అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డికి ఫుట్‌‌‌‌‌‌‌‌బాల్ ఆడే సరదా ఉంటే సొంత డబ్బులతో ఆడాలని.. అంతేకానీ ప్రజల పైసలు ఎలా మళ్లిస్తున్నారని ఆయన నిలదీశారు. మెస్సీతో మ్యాచ్ కోసం పెడుతున్న రూ. 100 కోట్లు ఎక్కడి నుంచి తెస్తున్నారో ప్రభుత్వం క్లారిటీ ఇవ్వాలన్నారు. సీఎం తన సరదా కోసం సింగరేణి నిధులను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తూ శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో సింగరేణి భవన్ ముట్టడికి యత్నించారు. 

ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొనడంతో మహేశ్వర్ రెడ్డితో పాటు పలువురు నేతలను పోలీసులు అరెస్టు చేశారు. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ... మెస్సీ కేవలం ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడితే అప్పీయరెన్స్ ఫీజు కింద రూ.70 కోట్లు తీసుకుంటారని తెలిసిందని, ఆయన సెక్యూరిటీ, ఫ్లైట్ ఖర్చులు అదనమని, ఇవన్నీ ప్రభుత్వమే భరిస్తున్నదని ఆరోపించారు.