ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ స్పందించాలి

ఎస్సీ వర్గీకరణపై సీఎం కేసీఆర్ స్పందించాలి

ఎస్సీ వర్గీకరణ చేపట్టాలన్న‌ సుప్రీంకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామ‌న్నారు బీజేపీ నేత మోత్కుపల్లి నర్సింహులు. రిజర్వేషన్ల ను ఆయా రాష్ట్రాల్లో పరిధిలోనే ఉండాలన్న సుప్రీంకోర్టు అభిప్రాయాన్ని స్వాగతిస్తున్నామ‌ని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని గతంలోనే బీజేపీ కూడా కోరిందన్నారు.

ఎస్సీ వర్గీకరణపై తాజాగా సుప్రీంకోర్టు చెప్పిన అభిప్రాయంపై ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించాలని మోత్కుప‌ల్లి అన్నారు. ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ, పలు సంఘాలు ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటం చేశాయని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం కూడా ఎస్సీ వర్గీకరణ కోసం తీర్మానం చేసిందని…వర్గీకరణ అమలయ్యే విధంగా చూడాలన్నారు. జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలని తెలిపారు. రిజర్వేషన్ల వర్గీకరణ వలన ఎవరికి నష్టం జరగద‌ని చెప్పారు

ఎస్సీ వర్గీకరణకు అన్ని రాజకీయ పార్టీలు సపోర్టు చేశాయని, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎస్సీ వర్గీకరణకు తీర్మానం చేయాల్సి ఉంద‌ని అన్నారు మోత్కుప‌ల్లి.