గ్రాఫ్ పడింది కాబట్టే.. సీపీఐతో టీఆర్ఎస్ కాళ్ల బేరం

గ్రాఫ్ పడింది కాబట్టే.. సీపీఐతో టీఆర్ఎస్ కాళ్ల బేరం
  • బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

హైదరాబాద్: టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోయింది కాబట్టే.. సీపీఐ, సీపీఎంతో కాళ్ల బేరానికి దిగిందని బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో అవకాశవాద రాజకీయాలు పరాకాష్టకు చేరాయన్నారు. ఎమ్మెల్సీ పదవి కోసం కమ్యూనిస్టులు ఆశపడుతున్నారని ఆరోపించారాయన. సీపీఐకు నారాయణ.. చీడ పురుగులా తయారయ్యారన్నారు. సీపీఎం అభ్యర్థి నామినేషన్ తిరస్కరణ, సీపీఐ టీఆర్ఎస్ కు మద్దతు తెలపటం వెనుక పరమార్థం ప్రజలకు అర్థమైందని అన్నారు.

కమ్యూనిస్టులను కేసీఆర్ ఏవిధంగా మాట్లాడారో ప్రజలు మర్చిపోలేదని గుర్తు చేశారు ఎన్వీఎస్ ప్రభాకర్. నామినేషన్స్ ముందు సీపీఐ.‌. నామినేషన్స్ తరువాత సీపీఎం టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇస్తున్నాయని అన్నారు. సిద్ధాంతాలను అమ్ముకున్న సీపీఎం, సీపీఐ లకు బుద్ధి చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. సీపీఐ, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శులు.. రాజా, సీతారాం ఏచూరిలకు లేఖ రాస్తానని చెప్పారు. పశ్చిమబెంగాల్,  త్రిపురలానే‌‌ వామపక్ష భావజాలం ఉన్నప్రజలంతా బీజేపీకే ఓటు వేస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.