సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలెక్కే ప్రయాణికులకు ఆఫర్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి రైలెక్కే ప్రయాణికులకు ఆఫర్

హైదరాబాద్​ సిటీ, వెలుగు: ఐఆర్​సీటీసీ ప్రయాణికులకు మరో ప్రత్యేక ఆఫర్ ​ప్రకటించింది. ‘జ్యోతిర్లింగ సహిత దివ్య దక్షిణ యాత్ర’ టూరిస్ట్​ రైలు నడపనున్నట్టు వెల్లడించింది. ఈ నెల 23న సికింద్రాబాద్ నుంచి ఈ యాత్ర ప్రారంభమవుతుందని, తిరువన్నమలైలోని అరుణాచలం ఆలయం, రామేశ్వరంలోని రామనాథస్వామి ఆలయం, మధురైలోని మీనాక్షి అమ్మన్ ఆలయం, కన్యాకుమారిలోని రాక్ స్మారక చిహ్నం, కుమారి అమ్మన్ ఆలయం, త్రివేండ్రంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయం, తిరిచ్చిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయం, తంజావూరులోని బృహదీశ్వర ఆలయాలను దర్శించుకోవచ్చని ప్రకటించింది. 

రాష్ట్రంలోని జనగామ, కాజీపేట, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, మధిర, ఏపీలోని విజయవాడ, తెనాలి, ఒంగోలు , నెల్లూరు, గూడూరు, రేణిగుంట వంటి స్టేషన్లలో రైలు ఆగుతుందన్నారు. యాత్ర 7 రాత్రులు,8  రోజుల పాటు కొనసాగుతుందన్నారు. ఎకానమీ కేటగిరీలో రూ. 14,100, స్లీపర్3 ఏసీ 22,500, 2ఏసీ రూ. 29,500 ఉంటుందన్నారు.

రైలు, రోడ్డు రవాణాతో సహా, వసతి సౌకర్యం, ఉదయం టీ, అల్పాహారం, లంచ్, డిన్నర్ ఉంటాయన్నారు. రైలులో సీసీ టీవీ కెమెరాలు, పబ్లిక్ అనౌన్స్​మెంట్ సౌకర్యం, ఇన్స్యూరెన్స్​ సౌకర్యం ఉంటుందన్నారు. బుకింగ్ కోసం : 9701360701, 9281030726,9281030740, 9281495845 నంబర్లలో సంప్రదించవచ్చని వెల్లడించారు. అలాగే ఆన్‌‌‌‌లైన్ బుకింగ్‌‌‌‌ల కోసం: www.irctctourism.com ను సందర్శించవచ్చు.