
Gold Price Today: ప్రస్తుతం బంగారం వెండి తీరు చూస్తుంటే నిపుణుల అంచనాలు నిజమౌతాయనే ఆందోళనలు సామాన్య భారతీయుల్లో పెరుగుతున్నాయి. గడచిన ఏడాదిలో గోల్డ్, సిల్వర్ భారీగా ర్యాలీ కావటంతో చాలా మంది అయోమయంగా ఉన్నారు. అంతర్జాతీయంగా ప్రధానంగా అమెరికా ఆర్థిక వ్యవస్థలో క్షీణతతో విలువైన మెటల్స్ పెరుగుదలను చూస్తున్నాయి. డాలర్ రేటు పతనం నుంచి బాండ్ ఈల్డ్స్ వరకు వస్తున్న మార్పులతో పాటు పెరుగుతున్న ఇండస్ట్రియల్, సెంట్రల్ బ్యాంక్ ఆర్డర్స్ రేట్లను ఊహలకు అందని స్థాయిలకు తీసుకెళుతున్నాయి.
24 క్యారెట్ల బంగారం రేటు నిన్న అంటే సెప్టెంబర్ 12తో పోల్చితే 10 గ్రాములకు సెప్టెంబర్ 13న రూ.110 తగ్గింది. అంటే గ్రాముకు రేటు రూ.11 తగ్గుదలతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో రిటైల్ విక్రయ రేట్లు ఇలా ఉన్నాయి..
ALSO READ : హైదరాబాద్లో విన్ ఫాస్ట్ ఈ–కార్లు..
24 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 13న):
హైదరాదాబాదులో రూ.11వేల 117
కరీంనగర్ లో రూ.11వేల 117
ఖమ్మంలో రూ.11వేల117
నిజామాబాద్ లో రూ.11వేల 117
విజయవాడలో రూ.11వేల 117
కడపలో రూ.11వేల 117
విశాఖలో రూ.11వేల 117
నెల్లూరు రూ.11వేల 117
తిరుపతిలో రూ.11వేల 117
ఇక 22 క్యారెట్ల గోల్డ్ రేటు సెప్టెంబర్ 12తో పోల్చితే ఇవాళ అంటే సెప్టెంబర్ 13న 10 గ్రాములకు రూ.100 పెరుగుదలను చూసింది. దీంతో శనివారం రోజున ఏపీ, తెలంగాణలోని ప్రముఖ నగరాల్లో తగ్గిన రిటైల్ గోల్డ్ విక్రయ ధరలను పరిశీలిస్తే..
22 క్యారెట్ల గోల్డ్ గ్రాముకు రేటు(సెప్టెంబర్ 13న):
హైదరాదాబాదులో రూ.10వేల 190
కరీంనగర్ లో రూ.10వేల 190
ఖమ్మంలో రూ.10వేల 190
నిజామాబాద్ లో రూ.10వేల 190
విజయవాడలో రూ.10వేల 190
కడపలో రూ.10వేల 190
విశాఖలో రూ.10వేల 190
నెల్లూరు రూ.10వేల 190
తిరుపతిలో రూ.10వేల 190
బంగారం రేట్లు శనివారం స్వల్పంగా తగ్గినప్పటికీ.. మరోపక్క వెండి తమ ర్యాలీని వారాంతంలో కొనసాగిస్తోంది. సెప్టెంబర్ 13న కేజీకి వెండి సెప్టెంబర్ 12తో పోల్చితే రూ.వెయ్యి పెరగటంతో తెలుగు రాష్ట్రాల్లో స్వచ్ఛమైన సిల్వర్ రేటు కేజీకి రూ.లక్ష 43వేలకు చేరుకుంది. అంటే గ్రాము వెండి రేటు రూ.143 వద్ద విక్రయాలు జరగుతున్నాయి.