హైదరాబాద్లో విన్‌ ఫాస్ట్ ఈ–కార్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 468 నుంచి 520 కిలోమీటర్లు పోవొచ్చు !

హైదరాబాద్లో విన్‌ ఫాస్ట్ ఈ–కార్లు.. ఒక్కసారి చార్జ్ చేస్తే 468 నుంచి 520 కిలోమీటర్లు పోవొచ్చు !

హైదరాబాద్, వెలుగు: ఎలక్ట్రిక్​ కార్లను తయారు చేసే వియత్నాం కంపెనీ విన్​ఫాస్ట్​ హైదరాబాద్​మార్కెట్లో అడుగుపెట్టింది. నానేశ్​ ఆటోమోటివ్స్​తో భాగస్వామ్యం కుదుర్చుకుని  వీఎఫ్6, వీఎఫ్7 అనే రెండు ప్రీమియం ఎలక్ట్రిక్ ఎస్​యూవీలను విడుదల చేసింది. ఒక్కసారి చార్జ్ చేస్తే ఇవి 468 నుంచి 520 కిలోమీటర్ల దూరం వెళ్తాయి. దీనికి అదనంగా బ్యాటరీపై పదేళ్ల వారంటీ ఇస్తున్నట్లు విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ ఇండియా డిప్యూటీ సీఈఓ అరుణోదయ్ దాస్ తెలిపారు.

ఈ మోడళ్లలో పనోరమిక్ సన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌రూఫ్, లెవల్-2 అడాస్, 360 కెమెరా, ఏడు ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బ్యాగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, లగ్జరీ ఇంటీరియర్స్​ వంటి అత్యాధునిక ఫీచర్లు ఉన్నాయి.   వీఎఫ్6 ఎక్స్-షోరూమ్ ధర రూ.16.49 లక్షల నుంచి మొదలవుతుండగా, వీఎఫ్7 ధర రూ.20.89 లక్షల నుంచి అందుబాటులో ఉంటుంది. 

చార్జింగ్​, ఆఫ్టర్​ సేల్​ సర్వీసుల కోసం విన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫాస్ట్ సంస్థ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గ్రిడ్, మై టీవీఎస్, గ్లోబల్ అష్యూర్ వంటి సంస్థలతో చేతులు కలిపింది. ఈ ఏడాది చివరి నాటికి 27 నగరాల్లో 35 డీలర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు, 26 వర్క్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.