Kishkindhapuri Box Office: కిష్కింధపురికి షాకింగ్ కలెక్షన్లు.. బెల్లంకొండ హారర్ ట్రీట్ మెంట్కి జనాలు భయపడలేదా?

Kishkindhapuri Box Office: కిష్కింధపురికి షాకింగ్ కలెక్షన్లు.. బెల్లంకొండ హారర్ ట్రీట్ మెంట్కి జనాలు భయపడలేదా?

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ హీరో హీరోయిన్లుగా నటించిన హారర్ థ్రిల్లర్ కిష్కింధపురి. కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేసిన ఈ మూవీ నిన్న (సెప్టెంబర్ 12న) థియేటర్లలో విడుదలైంది. ఈ క్రమంలో మోస్తరు కలెక్షన్లతోనే కిష్కింధపురి బాక్సాఫీస్ ప్రారంభమైంది. తొలిరోజు ఇండియాలో రూ.2 కోట్ల నెట్ కలెక్షన్ మాత్రమే సాధించినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ప్రపంచవ్యాప్తంగా రూ.3 నుండి 4 కోట్ల గ్రాస్ వచ్చినట్లు సమాచారం.

తొలిరోజు శుక్రవారం నాడు తెలుగు థియేటర్లలలో కిష్కింధపురి మొత్తం 37.05 శాతం ఆక్యుపెన్సీని మాత్రమే నమోదు చేసింది. ఉదయం 27.24%, మధ్యాహ్నం 29.96%, సాయంత్రం 33.32% మరియు రాత్రి 57.66% షోలతో ఆక్యుపెన్సీ కలిగి ఉంది. అయితే, ఈ సినిమాకు మిక్సెడ్ టాక్తో పాటుగా, ఎక్కువ థియేటర్లు లభించకపోవడం కలెక్షన్లపై ప్రభావం పడినట్లుగా ట్రేడ్ నిపుణులు భావిస్తున్నారు. 

మరోవైపు, ఈ హార్రర్ థ్రిల్లర్ మూవీకి తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ నుండి గట్టి పోటీ ఎదురైంది. ఈ రెండు సినిమాలు ఒకేరోజు (Sept12న) థియేటర్లలో రావడం మైనస్ అయింది. ఇకపోతే ఇండియాలో మిరాయ్ రూ.12 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.

అయితే, రెండో రోజైనా శనివారం వీకెండ్ అవ్వడంతో టికెట్ల బుకింగ్స్ జోరుగా సాగుతున్నాయి. ఈ క్రమంలో హారర్ మూవీని చూడాలని ఆడియన్స్ తెగ ఉత్సాహం చూపిస్తున్నారు. స్టోరీ ఎలా ఉన్న ఫ్రెష్ సీన్స్, థ్రిల్లింగ్ టేకింగ్‌తో తెరకెక్కిస్తే ఆడియెన్స్‌కు తప్పకుండా నచ్చుతుంది. ఈ విషయంలో కిష్కింధపురి సక్సెస్ అయిందనే నిజమైన టాక్ బయట కనిపిస్తుంది.

అయితే, తొలిరోజు మిరాయ్ టాక్ ఎక్కువ ఉండటంతోనే కిష్కింధపురిని టచ్ చేయని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇందులో భాగంగానే శని, ఆది వారాలు కిష్కింధపురిని ఆడియన్స్ తెగ చూసే అవకాశం కనిపిస్తుంది.  

ఇదిలా ఉంటే.. సాహు గారపాటి నిర్మించిన కిష్కింధపురి సినిమాకు.. రూ.20-25కోట్ల వరకు బడ్జెట్ అయ్యిందని ట్రేడ్ నిపుణుల లెక్కలు చెబుతున్నాయి. నటీనటులు, టెక్నీషియన్ల రెమ్యునరేషన్లు, సినిమా నిర్మాణ ఖర్చులు, ప్రచార ఖర్చులన్నీ కలుపుకొని ఇంత బడ్జెట్ అయిందని టాక్. ఈ క్రమంలో మూవీ హిట్ అవ్వాలంటే.. థియేట్రికల్ రన్ ద్వారా రూ.25 కోట్ల వరకు గ్రాస్ సాధించాల్సి ఉంది. చూడాలి మరి వీకెండ్ టాక్ ఎలా ఉంటుందో!

కథేంటంటే:

రాఘవ్ (బెల్లంకొండ శ్రీనివాస్), మైథిలీ (అనుపమ పరమేశ్వరన్) ఘోస్ట్‌లను చూపించే గైడ్స్. ఔత్సాహికులను పాడుబడ్డ భవనాల్లోకి తీసుకెళ్లి అక్కడి దెయ్యాల గురించి కథలుకథలుగా చెప్పి వాళ్లను భయపెట్టడమే వీళ్ల ప్రొఫెషన్. అలా ఓసారి సువర్ణమాయ అనే మూతపడిన రేడియో స్టేషన్‌కు వెళ్తారు. వాళ్లతో పాటు ఎనిమిది మంది ఔత్సాహికులు వస్తారు. కానీ ఈసారి అక్కడ నిజమైన దెయ్యం ఎదురుపడుతుంది.

రేడియోలోని వాయిస్‌తో వాళ్లను భయపెడుతుంది. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడతారు. కానీ ఆ దెయ్యం వార్నింగ్ ఇచ్చినట్టుగానే అక్కడికి వెళ్లి వచ్చిన వాళ్లలో ఒక్కక్కరూ చనిపోతుంటారు. ఇంతకూ రేడియో స్టేషన్‌లో ఉన్న దెయ్యం ఎవరు? తన గతం ఏమిటి? ఎందుకలా చంపుతోంది? దాని బారి నుంచి మిగతా వాళ్లను కాపాడటానికి రాఘవ్ ఏం చేశాడనేదే మిగతా కథ.