కేసీఆర్‌‌ అంటే.. ‘కిలాడి చంద్రశేఖర రావు’

కేసీఆర్‌‌ అంటే.. ‘కిలాడి చంద్రశేఖర రావు’
  • ప్రజల దృష్టి మరల్చేందుకే ‘కేటీఆర్‍ సీఎం’ అంటూ డ్రామాలు
  • కేసీఆర్‌కు దమ్ముం టే అసెంబ్లీ రద్దు చేయాలి: పొంగులేటి

ఖమ్మం, వెలుగు: కేసీఆర్‍ అంటే… ‘‘కిలాడి చంద్రశేఖర రావు’’  అని బీజేపీ నేత,  మాజీ  ఎమ్మెల్సీ పొంగులేటి  సుధాకర్‍రెడ్డి అన్నారు.  ఖమ్మంలో శనివారం ఏర్పాటు  చేసిన మీడియా  సమావేశంలో మాట్లాడుతూ.. జనంలో  తనపై వ్యతిరేకత  వచ్చినప్పుడు, తన  అసలు గుట్టు  బయటపడినప్పుడు సీఎం డ్రామాలకు తెరతీస్తారని ఆరోపించారు. నాగార్జున  సాగర్‍ బై ఎలక్షన్స్, ఎమ్మెల్సీ,  ఖమ్మం, వరంగల్‍ మున్సిపల్‍ కార్పొరేషన్‍ ఎలక్షన్స్ ఉండటంతో  ‘కేటీఆర్ సీఎం’ అంటూ ప్రజలను మాయ చేస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ కు దమ్ముంటే  అసెంబ్లీ  రద్దు చేసి  ఎన్నికలకు  సిద్ధం  కావాలని సవాల్​ విసిరారు.  సీతారామ  ప్రాజెక్టుతో రూ.4,200  కోట్లు,  కాళేశ్వరం ద్వారా రూ. 21  వేల  కోట్లు  కాంట్రాక్టర్లకు దోచిపెట్టారని ఆరోపించారు. వీటిపై  కేంద్రం  దర్యాప్తు  జరుపుతుందన్నారు.

రామ మందిర నిర్మాణానికి రూ.లక్ష 

అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పొంగులేటి రూ.లక్ష విరాళంగా ఇచ్చారు. శనివారం ఖానాపురంలోని  అభయ  వెంకటేశ్వరస్వామి  దేవాలయంలో రామ జన్మభూమి ట్రస్ట్​  జిల్లా  కన్వీనర్ అల్లికకు చెక్కును అందజేశారు.