ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్పై గవర్నర్కు రఘునందన్రావు ఫిర్యాదు

ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్పై గవర్నర్కు రఘునందన్రావు ఫిర్యాదు

 ఎస్సీ, ఎస్సీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేత,మాజీ ఎమ్మెల్యే  రఘునందన్ రావు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉండి   2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ ఎస్ అనుకూలంగా ప్రచారం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ తమిళిసై ని కోరారు. 

ఎన్నికలకు ముందు దుబ్బాక నియోజకవర్గానికి చెందని వెంకటయ్యను గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమించిందని, అతని భార్య సర్పంచ్గా కూడా ఉన్నారని తెలిపారు. అయితే రాజ్యాంగ బద్ధ పదవిలో ఉన్న వెంకటయ్య బీఆర్ ఎస్ తరపున ఎన్నికల ప్చారం, డబ్బు, మద్యం పంపిణీలో చురుగ్గా పాల్గొన్నారని ఆరోపించారు.  

బీఆర్ ఎస్ పార్టీ కండువా వేసుకొని ప్రచారం చేశారన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సాక్ష్యాధారాలతో గవర్నకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అధికార హోదాతో దుర్వినియోగానికి పాల్పడిన వెంటకయ్యపై చర్యలు తీసుకోవాలని ఆయనను వెంటనే ఆ పదవి నుంచి తొలగించాలని కోరినట్లు తెలిపారు.