నేను పార్టీ మారట్లేదు..బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనే: వివేక్ వెంకటస్వామి

నేను పార్టీ మారట్లేదు..బీఆర్ఎస్ కు  ప్రత్యామ్నాయం బీజేపీనే: వివేక్ వెంకటస్వామి

బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీయే అని ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. తాను పార్టీ మారుతున్నారనే వార్తలపై ఆయన స్పష్టతనిచ్చారు. తాను కాంగ్రెస్ లోకి వెళ్లడం లేదని పార్టీ మార్పుపై వస్తున్న వార్తలు పూర్తి అవాస్తవమన్నారు. రాష్ట్ర బీజేపీలో ఎలాంటి నాయకత్వ మార్పులు ఉండవని నాలుగు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని అధ్యక్షుని ఎందుకు మారుస్తారని ప్రశ్నించారు.

గత కొన్ని రోజులుగా వివేక్ వెంకటస్వామి పార్టీ మారుతున్నారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అలాగే రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిని కూడా మారుస్తున్నారంటూ చర్చ  జరుగుతోంది. ఈ విషయంపై ఇటీవలే రాష్ట్ర బీజేపీ ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ క్లారిటీ ఇచ్చారు. బండి సంజయ్ ని మార్చడం లేదని చెప్పారు.