బండి సంజయ్ భవానీ మాలధారణ.. దసరా వరకు ఆలయంలోనే కేంద్ర మంత్రి

బండి సంజయ్ భవానీ మాలధారణ.. దసరా వరకు ఆలయంలోనే కేంద్ర మంత్రి

కరీంనగర్: కరీంనగర్ మహాశక్తి ఆలయంలో బండి సంజయ్ భవానీ మాల ధరించారు. అమ్మ వారి సేవలో తరిస్తూ దసరా వరకు ఆలయంలోనే కేంద్ర మంత్రి బండి సంజయ్ భవానీ దీక్ష పాటించనున్నారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన దీక్ష స్వీకరించారు.

11 రోజుల పాటు భవానీ దీక్షలో కొనసాగనున్నారు. నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లను బండి సంజయ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. భవానీ మాలధారులు, భక్తులతో మహాశక్తి ఆలయం సందడిగా మారింది. ఈ నెల 11 నుంచి అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు మొదలు కానున్నాయి.

రోజుకో అలంకారంలో భక్తులకు మహాశక్తి అమ్మవారు దర్శనమివ్వనుండటం విశేషం. భక్తులకు ఉచిత ప్రసాదం, అల్పాహారం, మధ్యాహ్న భోజన సౌకర్యాలు కల్పించనున్నారు. ప్రతిరోజూ 5 వేల నుంచి 10 వేల మంది భక్తులకు అన్నప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక సౌకర్యాలు కల్పించారు. మహాశక్తి ఆలయ నవరాత్రి ఉత్సవాలు 16 ఏళ్లుగా కొనసాగుతున్నాయి. గత రెండేళ్లుగా వేల సంఖ్యలో యువకులు దీక్షలు చేపడుతున్నారు.