
హైదరాబాద్, వెలుగు: బీజేపీ నాయకులు చలో ప్రగతి భవన్‌కు పిలుపునిస్తే నిద్రలేవక ముందే అరెస్టు చేసే పోలీసులు.. కాంగ్రెస్ చలో రాజ్ భవన్‌కు పిలుపునిస్తే టీఆర్ఎస్ సర్కార్ ఎందుకు మౌనంగా ఉందని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ చేసిన ఆందోళన, విధ్వంసం తీరు చూస్తే.. కాంగ్రెస్, టీఆర్ఎస్ కొత్త డ్రామా షురూ చేసినట్లు అనిపిస్తోందన్నారు. రాహుల్‌పై కేసు నమోదైతే, రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని ఆయన ప్రశ్నించారు. ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేయడం, టూ వీలర్స్‌ను తగలబెట్టడం ఏంటని మండిపడ్డారు. ఇదంతా బీజేపీని బద్నాం చేసే డ్రామా అని ఆరోపించారు.