డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లతో బీజేపీ నేతలకు ఘన స్వాగతం

డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లతో బీజేపీ నేతలకు ఘన స్వాగతం

హైదరాబాద్, వెలుగు: హెచ్‌‌‌‌‌‌‌‌ఐసీసీ నోవాటెల్ హోటల్‌‌‌‌‌‌‌‌ తెలంగాణ కళాకారులతో సందడిగా మారింది. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు వస్తున్న యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్‌‌‌‌‌‌‌‌తో పాటు పలు రాష్ట్రాల సీఎంలు, కేంద్ర మంత్రులు, ఎంపీలు, జాతీయ కార్యవర్గ సభ్యులకు డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లు, ప్రదర్శనలతో కళాకారులు ఘన స్వాగతం పలికారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున కళాకారులు తరలి వచ్చి వారి కళా రూపాలను ప్రదర్శించారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు ఉట్టిపడేలా కార్యక్రమం నిర్వహించారు. మహిళా కళాకారులంతా ఒకే రంగు చీరలో కోలాటం ఆడారు. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డి కూడా వారితో కలిసి కోలాటం ఆడి సందడి చేశారు. బంజారా మహిళల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఎంపీ అర్వింద్‌‌‌‌‌‌‌‌, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి తదితరులు కళాకారులతో కలిసి డ్యాన్స్‌‌‌‌‌‌‌‌లు చేశారు. అన్ని కళారూపాల్లో గుస్సాడి నాట్యం ప్రత్యేకంగా అలరించింది. మూడ్రోజుల పాటు కోలాటం, దాండియా, గర్బా కళను ప్రదర్శించేందుకు  కళాకారులు బృందాలుగా ఇక్కడకు వచ్చారు. కాగా సమావేశాలకు వచ్చిన బీజేపీ అగ్ర నేతలు కళాకారుల ప్రదర్శనలను చూసి మెచ్చుకున్నారు.