రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్టులు

రాష్ట్రవ్యాప్తంగా బీజేపీ నేతల హౌస్ అరెస్టులు

రాష్ట్రంలో బీజేపీ నేతలను పోలీసులు ఎక్కడికక్కడే అరెస్ట్ చేస్తున్నారు. సోమవారం దుబ్బాకలో బీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పోలీసుల తీరును నిరసిస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. నిన్నటి ఘటనతో హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్ ముట్టడికి బీజేపీ పిలుపునిచ్చింది. అదేవిధంగా చలో క్యాంప్ ఆఫీస్‌కు BJYM నేతలు పిలుపునిచ్చారు. దాంతో అలర్ట్ అయిన సర్కారు.. ముందు జాగ్రత్తగా భారీగా పోలీసులను మోహరించింది. నిరసనలు దృష్ట్యా రాష్ట్రంలో బీజేపీ నేతలను ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎంపీ అర్వింద్, మాజీ ఎంపీ వివేక్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బీజేపీ ఎమ్మెల్సీ రాంచందర్ రావును పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

కాగా.. బండి సంజయ్‌పై పోలీసుల తీరును నిరసిస్తూ అన్ని గ్రామాలు, మండల కేంద్రాల్లో బీజేపీ నాయకులు నిరసన చేస్తున్నారు. కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై దురుసుగా ప్రవర్తించిన సీపీని సస్పెండ్ చేసి, కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

For More News..

కేక్ కట్ చేసిన కాసేపటికే కానరానిలోకాలకు.. బర్త్‌డేనే డెత్ డే అయింది

దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు

ఆస్ట్రేలియా టూర్‌‌కు టీమిండియా ఎంపిక.. ఒక్క ఫార్మాట్‌కు ఎంపిక కాని రోహిత్ శర్మ