సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.. 

సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మ దహనం.. 

టీఆర్ఎస్ ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదివారం పురాణపుల్ చౌరాస్తాలో బీజేపీ నేత ఉమామహేంద్ర ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన సీఎం కేసీఆర్ పై ధ్వజమెత్తారు. రాష్ట్ర ప్రజలంతా తలదించుకునే విధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రధానికి సీఎం ఆహ్వానం పలకకపోవడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రానికి వీవీఐపీలు వచ్చిన తరుణంలో తగిన ఏర్పాట్లు చేయకుండా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. 

ప్రధాని మోడీ నగరానికి వస్తున్న సందర్భంగా రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తున్న యశ్వంత్ సిన్హాను నగరానికి పిలిపించి అర్థంపర్థం లేని హడావుడి చేశారని ఉమామహేంద్ర మండిపడ్డారు. కేసీఆర్ కు ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేదని ఆయన విమర్శించారు. కేసీఆర్ చేస్తున్న వ్యవహార శైలిని రాష్ట్ర ప్రజలు తప్పుపడుతున్నారని అన్నారు. నగరంలో తాము నిర్వహిస్తున్న కార్యక్రమాలతో టీఆర్ఎస్ పీఠాలు కదులుతున్నాయని..రాబోయే రోజుల్లో టీఆర్ఎస్ కు పుట్టగతులు ఉండవని విమర్శించారు. బీజేపీ కార్యక్రమాలకు పోటీగా సైకిల్ ర్యాలీ, బైక్ ర్యాలీలంటూ పనికిమాలిన కార్యక్రమాలు చేశారని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించడానికి ఓటర్లు సిద్ధంగా ఉన్నారని..టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు చేసిన తమ విజయాన్ని అపలేరని ఉమామహేందర్ దీమా వ్యక్తం చేశారు.