- కోఠి డీఎంఈ ఆఫీస్ ముందు బీజేపీ మహిళా మోర్చా ఆందోళన
బషీర్ బాగ్, వెలుగు : ఆశా వర్కర్ల వేతనాలు పెంచాలని కోరుతూ బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం కోఠిలోని డీఎంఈ ఆఫీస్ముందు ఆందోళనకు దిగారు. మహిళా మోర్చా నాయకులు ఆఫీస్లోపలికి వెళ్లేందుకు పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. అనంతరం మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ..
ప్రభుత్వ హామీ ప్రకారం ఆశా వర్కర్ల వేతాన్ని రూ.9వేల నుంచి రూ.18 వేలకు పెంచాలని డిమాండ్చేశారు. కరోనా టైంలో ప్రాణాలను పణంగా పెట్టి, పనిచేసిన ఆశాల సేవలపై చిన్నచూపు తగదన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని కోరారు. ఆశాల సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. డీఎంఈ జాయింట్ డైరెక్టర్ డా.పద్మజకు వినతి పత్రం అందజేశారు.
