బతుకమ్మ వేడుకలకు ఆంక్షలు సరికాదు : బీజేపీ మహిళా మోర్చా

బతుకమ్మ వేడుకలకు ఆంక్షలు సరికాదు :  బీజేపీ మహిళా మోర్చా
  • రాష్ట్ర సర్కారును తప్పుపట్టిన బీజేపీ మహిళా మోర్చా
  • నేడు చార్మినార్ వద్ద పార్టీ ఆధ్వర్యంలో వేడుకలు

హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ప్రజల సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ వేడుకలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆంక్షలు విధించడం అన్యాయమని బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మేకల శిల్పారెడ్డి అన్నారు. బతుకమ్మ ఉత్సవాలకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదని, కోర్టు ఆర్డర్ల ద్వారా అనుమతి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. 

బీజేపీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు చార్మినార్ వద్ద బతుకమ్మ వేడుకలు నిర్వహించనున్నట్టు ఆమె తెలిపారు. ఈ వేడుకలకు సంబంధించిన పోస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ స్టేట్ ప్రెసిడెంట్ రాంచందర్​ రావు రిలీజ్ చేశారు.