బీసీలకు అత్తెసరు నిధులేనా.. తెలంగాణలో బీసీలకు అన్యాయం

బీసీలకు అత్తెసరు నిధులేనా.. తెలంగాణలో బీసీలకు అన్యాయం

వెనుకబడిన వర్గాలకు కేసీఆర్ వెన్నుపోటు పొడిచారని, ఓబీసీలు వచ్చే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి కేసీఆర్‌కు చెంపపెట్టు లాంటి తీర్పునివ్వాలని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి  అన్నారు. పనులు మానుకొని కుల వృత్తులు, సబ్బండ వర్గాలు పోరాడితే తెలంగాణ వచ్చిందని, రాష్ట్రం వచ్చాక గద్దెనెక్కిన కేసీఆర్ కుల వృత్తులకు తీరని అన్యాయం చేశారని విమర్శించారు. ఓబీసీ రిజర్వేషన్లు తగ్గిస్తూ రాజ్యాంగ విరుద్ధమైన మత రిజర్వేషన్లు అమలు చేశారని తెలిపారు. బీసీ కమిషన్ కు కోరలు లేకుండా చేశారని, బీసీ సంక్షేమానికి అత్తెసరు నిధులే కేటాయిస్తున్నారని తెలిపారు. తెలంగాణలో అన్యాయమవుతోన్న బీసీలకు న్యాయం చేసేలా బీజేపీ బీసీ డిక్లరేషన్ ఉందన్నారు.