హైదరాబాద్, వెలుగు: ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్‌లో తెలంగాణ ప్లేయర్లు గోల్డ్ సహా నాలుగు మెడల్స్‌తో సత్తా చాటారు. చత్తీస్‌గఢ్‌లోని సుర్గుజాలో జరుగుతున్న ఈ ఈవెంట్‌లో రెజ్లర్లు నాగలక్ష్మి స్వర్ణం, జాదవ్ చరణ్, తరా రాజు కాంస్యాలు గెలిచారు. అథ్లెటిక్స్‌లో సపావత్ దత్తు సిల్వర్ నెగ్గాడు. మంగళవారం జరిగిన విమెన్స్ 57 కిలోల రెజ్లింగ్ ఫైనల్లో నాగలక్ష్మి 10–0తో కర్నాటక రెజ్లర్ సాయి సిద్ధిని చిత్తు చేసి స్వర్ణం అందుకుంది.
గ్రీకో -రోమన్ 77 కేజీ విభాగం కాంస్య పతక పోరులో చరణ్ 8–-0 తో చత్తీస్‌గఢ్‌కు చెందిన హనీష్ కుమార్‌పై నెగ్గగా.. 135 కేజీ కేటగిరీలో రాజు కూడా కాంస్యం అందుకున్నాడు. మెన్స్ 110 మీటర్ల హార్డిల్స్ ఈవెంట్‌లో 16.65 సెకండ్లతో రెండో ప్లేస్‌లో నిలిచిన దత్తు సిల్వర్ ఖాతాలో వేసుకున్నాడు.
