ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌: మనిక గెలుపు.. శ్రీజ ఓటమి

ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌: మనిక గెలుపు.. శ్రీజ ఓటమి

మకావు: ఐటీటీఎఫ్ టేబుల్ టెన్నిస్ వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా స్టార్ ప్లేయర్ మనిక బత్రా కీలక విజయం సాధించింది. విమెన్స్ సింగిల్స్‌‌‌‌‌‌‌‌ గ్రూప్ దశ తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఓటమి నుంచి పుంజుకున్న బత్రా మంగళవారం జరిగిన రెండో పోరులో  3–-2తో అమెరికాకు చెందిన లిలీ జాంగ్‌‌‌‌‌‌‌‌పై గెలిచి నాకౌట్ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మరోవైపు గ్రూప్–-2 మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో ఆకుల శ్రీజ 1–-3 తేడాతో ఫు యు (పోర్చుగల్‌‌‌‌‌‌‌‌) చేతిలో ఓడగా.. మెన్స్‌‌‌‌‌‌‌‌లో  మానవ్ థక్కర్ 0–3తో గాంగ్‌‌‌‌‌‌‌‌హ్యోన్ (కొరియా) చేతిలో చిత్తయ్యాడు.