ఉద్యోగుల కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేసిండు

ఉద్యోగుల కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేసిండు

తెలంగాణ ద్రోహులైన సీపీఎం పార్టీతో కేసీఆర్ దోస్తానా బాధాకరం అని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విమర్శించారు. రంగారెడ్డి జిల్లా ఫరూక్ నగర్ మండలం మొగిలిగిద్ద గ్రామంలో జరిగిన విలేకరులు సమావేశంలో ఈటల పాల్గొన్నారు. కాంగ్రెస్ లో వివాదాలు ఎలా సృష్టించాలి.. బీజేపీని ఎలా దెబ్బతీయాలి అనే ప్రణాళికలతో ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేశారని విమర్శించారు. 317 జీవో తెచ్చి ఉద్యోగుల కుటుంబాల్లో ప్రశాంతత లేకుండా చేశారన్నారు. డబుల్ బెడ్ రూమ్స్ ధ్యాస వదిలేసి ఎవరి స్థలాల్లో వాళ్లు ఇళ్లు కట్టుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిరుద్యోగులకు ఉద్యోగ భృతి చెల్లించి... లక్షా 99 వేల ఉద్యోగాలు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీ చేయాలన్నారు ఈటల.