ఉద్యమ పార్టీని..ఉద్యమకారులను కేసీఆర్ మర్చిపోయేలా చేసిండు

ఉద్యమ పార్టీని..ఉద్యమకారులను కేసీఆర్ మర్చిపోయేలా చేసిండు

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ నిర్ణయం తీసుకోవడంతో తెలంగాణకు సీఎం కేసీఆర్ కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. ఉద్యమ పార్టీని ఖతం చేసి..ఉద్యమకారులను మర్చిపోయేటట్టు చేసి..కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని చెప్పారు. BRS పార్టీ స్థాపనతో తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్ కి ఉన్న బంధం తెగిపోయిందన్నారు.

కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ పెట్టుకున్న తరువాత ఆయన నమ్ముకున్నది మద్యాన్ని, డబ్బుని, ప్రలోభాలనే అని ఈటల రాజేందర్ ఆరోపించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతో దేశంలో రాజకీయ చెలామణి చేయాలని పగటి కల కంటున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కల కలగానే మిగిలిపోతుందన్నారు. తెలంగాణలో సమస్యలు పరిష్కరించలేక ప్రజల విశ్వాసాన్ని కోల్పోయారన్నారు. ఉనికిని కోల్పోయే పరిస్థితుల్లో ఉన్న సమయంలో కేసీఆర్ ఇబ్బంది పడుతుంటే .. ఆ బాధను దేశం మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఈటల రాజేందర్ అన్నారు.