రూ.3 వేలు ఇవ్వనిదే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్

రూ.3 వేలు ఇవ్వనిదే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయట్లేదు : ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్
  •     అసెంబ్లీలో బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్​ ఆరోపణ

హైదరాబాద్, వెలుగు: దేశ పురోగతి కోసం కేంద్రం అమలు చేస్తున్న జీఎస్టీని రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఇంప్లిమెంట్ చేయట్లేదని బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్ ఆరోపించారు. అసెంబ్లీలో సోమవారం తెలంగాణ వస్తు, సేవల పన్ను (సవరణ) బిల్లు 2026పై జరిగిన చర్చలో మాట్లాడారు. జీఎస్టీ విషయంలో అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. ‘‘మా జిల్లాలో రూ.3 వేలు ఇవ్వనిదే జీఎస్టీ రిజిస్ట్రేషన్ చేయడం లేదు. 

ఆటో అప్రూవల్ ఉన్నచోట కొర్రీలు పెడుతూ డబ్బులు వసూలు చేస్తున్నరు. సుమోటో క్యానోలేషన్ క్రమంలో డీలర్​కు సమాచారం ఇవ్వడంలేదు’’అని ఆరోపించారు. ఈ క్రమంలో స్పీకర్ కలగజేసుకుని సబ్జెక్ట్​పై మాట్లాడాలని సూచించగా, తమ వివరణ వినాలని బీజేపీ ఎమ్మెల్యేలు కోరారు. అక్బరుద్దీన్ తమ పార్టీ లీడర్​ను తిట్టాడని బీజేపీ ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. తమకు మాట్లాడే చాన్స్​ ఇవ్వాలంటూ పోడియం వద్దకు వెళ్లగా, సభలో కాసేపు గందరగోళం నెలకొంది.