నిరంజన్ రెడ్డి అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

నిరంజన్ రెడ్డి అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తా: ఎమ్మెల్యే రఘునందన్ రావు

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేయబోతున్నామని తెలిపారు బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు. ఆదివారం మంత్రి నిరంజన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు రఘునందన్ రావు ధీటుగా కౌంటర్ ఇచ్చారు. ఏప్రిల్ 24వ తేదీ సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. సర్వే నెం. 65 మినహా మంత్రి ఏ ఒక్క అంశంపై సమాధానం ఇవ్వలేదని అన్నారు. గిరిజన బిడ్డను అడ్డు పట్టుకొని మీరు పొందిన సబ్బీడీలు ఎన్ని అని రఘునందన్ ప్రశ్నించారు. ప్రజలను మంత్రి నిరంజన్ రెడ్డి మభ్య పెట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. తాను అడిగిన ఏ ఒక్క ప్రశ్నకు మంత్రి సమాధానం చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు మంత్రి కొనుగోలు చూసిన భూముల లెక్కలు చూపించారా అని నిలదీశారు రఘునందన్ రావు.

మంత్రి నిరంజన్ రెడ్డి గతంలో ఓ గిరిజన బిడ్డను తన దత్తపుత్రుడిగా చెప్పుకున్నట్లు ఆరోపణలు వినిపించాయని రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. ఆ దత్తపుత్రుడి పేరుపై కాంట్రాక్ట్ వర్కులు చేపించుకున్నారని వెల్లడించారు. మంత్రి నిరంజన్ రెడ్డి కొన్న భూముల వివరాలు ఎందుకు రికార్డుల్లో చూపించలేదని ప్రశ్నించారు. మంత్రి తన పాత నెంబర్ నుంచి రెగ్యులర్ గా చైనాకు కాల్స్ వెళ్లాయని.. చైనాకు చెందిన ఓ వ్యక్తితో అర్ధిక లావాదేవీలు జరిగాయన్నారు. ఇప్పటివరకు ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని రఘునందన్ ఫైర్ అయ్యారు.  మంత్రి నిరంజన్ రెడ్డి అక్రమాలపై ఈడీకి ఫిర్యాదు చేస్తామని తెలిపారు ఎమ్మెల్యే రఘనందన్ రావు. 

https://youtu.be/seYMF2CS2Gs