మండలిలో కవిత చెప్పింది నిజం కాదా?

మండలిలో కవిత చెప్పింది నిజం కాదా?

గంటసేపు వాన కొడితే అసెంబ్లీని మూడు రోజులు వాయిదా వేశరన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు.  కవిత ఎంపీటీసీలకు కుర్చిలు లేవని శాసన మండలిలో చెప్పిందని..ఎంపీటీసీ లకు కుర్చీలు ఇవ్వంది ఈ ప్రభుత్వం కాదా ? అని ప్రశ్నించారు. ఐ అండ్ పీఆర్ డిపార్ట్ మెంట్‌లో  రూ.800 కోట్ల కుంభకోణం జరిగిందన్నారు అసెంబ్లీలో కేటీఆర్ స్పీచ్ వింటుంటే.. కేసీఆర్ వచ్చిన తర్వాతే తెలంగాణ వాళ్ళు భోజనం చేస్తున్నారు... పోలియో టీకాలు వేసుకుంటున్నారన్నట్టుగా ఉందన్నారు.  టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను విమర్శిస్తే తెలంగాణను అవమాన పరిచినట్టుగా ఉందన్నారు. టీఆర్ఎస్  ఎన్నిఅబద్ధాలు చెప్పినా, కుట్రలు, కుతంత్రాలు చేసినా హుజురాబాద్ లో బిజెపి గెలుస్తుందన్నారు. హరీష్ హుజూరాబాద్ లోనే ఉండి అబద్ధాలు చెప్పి డబ్భులు పంచినా...కుల సంఘాల మీటింగ్ లు పెట్టినా బీజేపీదే విజయమన్నారు. ఎలక్షన్ కమిషన్ నిబంధనలకు లోబడే జాతీయ నేతలతో కలిసి అక్టోబర్ 2 న బండిసంజయ్ పాదయాత్ర ముగింపు సభ ఉంటుందన్నారు.

గ్రామ పంచాయతీలో కనీసం కూర్చోడానికి ఎంపీటీసీలకు కుర్చీ ఉండటం లేదని, తగిన గౌరవం దక్కడం లేదని  కవిత మండలిలో అన్నారు. కొత్తగా మండలాలు ఏర్పాటైనా మండల ప్రజా పరిషత్‌‌‌‌లకు తగిన ఆఫీసులులేవని, రోజు వారీ అధికారిక విధుల నిర్వహణలో ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు.