Hardik Pandya: లవర్తో స్విమ్మింగ్ పూల్లో హార్దిక్ పాండ్యా రొమాన్స్.. నెట్టింట ఫోటోలు వైరల్! 

Hardik Pandya: లవర్తో స్విమ్మింగ్ పూల్లో హార్దిక్ పాండ్యా రొమాన్స్.. నెట్టింట ఫోటోలు వైరల్! 

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా తన లవర్ మహికా శర్మకు పుట్టినరోజు నాడు ప్రత్యేకమైన గిఫ్ట్ ఇచ్చాడు. అర్ధరాత్రి సోషల్ మీడియాలో రొమాంటిక్ స్టైల్‌లో బర్త్‌డే శుభాకాంక్షలు తెలిపిన ఒక ఫొటోను షేర్ చేయగా.. ఈ పిక్ క్షణాల్లోనే వైరల్ అయింది. హార్దిక్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీలో పంచుకున్న ఆ ఫొటోలో, వీరు స్విమ్మింగ్ పూల్‌లో కనిపించారు. హార్దిక్ మహికాను ప్రేమగా కౌగిలించుకుని ఉన్న ఫొటోకు “హ్యాపీ బర్త్‌డే, నా యువరాణి” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. కిల్ బిల్ పాండ్యా పెట్టిన ఈ రొమాంటిక్ పోస్ట్ అభిమానులను తెగ నచ్చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. 
  
టీ20 వరల్డ్ కప్ 2026లో హార్దిక్ పాండ్యా ఆడుతున్న ప్రతి మ్యాచ్‌కు ప్రియురాలు మహికా శర్మ స్టేడియానికి వచ్చి అతడికి సపోర్టు చేస్తుంది. ఆమె జట్టుతో పాటు ప్రయాణిస్తున్నట్లు కూడా కనిపించింది. భారత్– పాకిస్తాన్ మ్యాచ్ కోసం హార్దిక్‌తో కలిసి శ్రీలంకకు కూడా మహికా వెళ్లినట్లు తెలుస్తుంది.  

ఎవరీ మహికా శర్మ: 
మహికా శర్మ ఒక మోడల్, నటి, ఫిట్‌నెస్ కంటెంట్ క్రియేటర్ కూడా.. ఢిల్లీలో జన్మించిన ఆమె ఎకనామిక్స్, ఫైనాన్స్‌లో డిగ్రీ పూర్తి చేసింది. నేడు మహికా శర్మ 25వ పుట్టినరోజు జరుపుకుంటోంది. హార్దిక్ –మహికా రిలేషన్‌షిప్ గత సంవత్సర కాలంగా కొనసాగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. 2024లో హార్దిక్ పాండ్యా తన మాజీ భార్య నటాషా స్టాంకోవిక్ తో విడాకులు తీసుకున్న తర్వాత మహికాతో డేటింగ్ చేస్తున్నాడు.

మైదానంలో అదరగొడుతున్న హార్దిక్:   
వ్యక్తిగత జీవితంతో పాటు స్టేడియంలో కూడా హార్దిక్ పాండ్యా అద్భుత ప్రదర్శన చేస్తూ భారత జట్టుకు మ్యాచ్ విన్నర్‌గా నిలుస్తున్నాడు. 2026 టీ20 వరల్డ్ కప్‌లో ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌ల్లో 87 పరుగులు చేసిన అతడు.. ఇందులో ఒక హాఫ్ సెంచరీ కూడా ఉంది. అంతేకాదు ఐదు వికెట్లు కూడా తీసుకున్నాడు. నమీబియాతో జరిగిన మ్యాచ్‌లో పాండ్యా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకున్నాడు.