
హుజురాబాద్ ఉపఎన్నిక ఎప్పుడు జరిగినా గెలిచేది బీజేపీయేనన్నారు ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్. హుజురాబాద్ ఎన్నిక త్వరగా జరక్కుండా సీఎం కేసీఆర్... సీఎస్ తో తప్పుడు రిపోర్ట్ పంపించారని ఆరోపించారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా సాగుతోందని చెప్పారు. రాష్ట్రంలో వచ్చేది పేదల బీజేపీ సర్కారేనన్నారు రాజాసింగ్. లక్ష రూపాయల రుణమాఫీ ఏమైందో మంత్రి హరీశ్ రావు చెప్పాలన్నారు. రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు టీఆర్ఎస్ నేతలకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు.
లిక్కర్ ద్వార ప్రభుత్వానికి వేల కోట్ల ఆదాయం వస్తుందని...ప్రజల రక్తంతో ప్రభుత్వం నడుస్తోందన్నారు. రాష్ట్రాన్ని మత్తు తెలంగాణగా చేస్తున్నారన్న రాజాసింగ్...ధూల్ పెట్ కు వస్తా అని సీఎం అన్నారు... పథకం తీసికొస్తా అని అన్నారు ఏమైందని ప్రశ్నించారు. డ్రగ్స్ కేసు ఈడీ విచారణలో రాజకీయ నాయకులు కూడా బయటకు వస్తారని తెలిపారు రాజాసింగ్.