లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ

లంచం డిమాండ్ చేసిన ప్రభుత్వ ఉద్యోగి పై చేయి చేసుకున్న బీజేపీ ఎంపీ

రాజస్థాన్‌లోని చిత్తోర్‌గఢ్ బీజేపీ ఎంపీ.. ప్రభుత్వ ఉద్యోగిపై చేయి చేసుకున్నారు. లంచం డిమాండ్ చేశాడన్న ఆరోపణలపై స్పందించిన ఎంపీ సీపీ జోషి.. ఆ ఉద్యోగి చెంప చెళ్లుమనిపించారు. భూ పట్టాలకు సంబంధించి ఓ రైతు నుంచి.. సదరు ఉద్యోగి రూ.5వేలు లంచం డిమాండ్ చేశాడు. అయితే.. తాము డబ్బులు ఇవ్వలేమని చెప్పిన రైతుకు భూ పట్టాల బదలాయింపు జరగదని ఉద్యోగి బెదిరించాడు. దీంతో రైతు.. ఆ ఉద్యోగి పై అధికారులకు ఫిర్యాదు చేశాడు.

ప్రభుత్వ ఉద్యోగి లంచం డిమాండ్ చేస్తున్న విషయం బీజేపీ ఎంపీ వరకు వెళ్లింది. తానే స్వయంగా ప్రభుత్వ కార్యాలయానికి వచ్చి సదరు ఉద్యోగిని ఎంపీ ప్రశ్నించారు. రైతు వద్ద లంచం డిమాండ్ చేశావా అంటూ తోటి ఉద్యోగుల ముందు నిలదీశారు. అంతటితో ఆగకుండా అందరూ చూస్తుండగానే.. లంచం అడిగిన ఉద్యోగి పై ఎంపీ చేయి చేసుకున్నారు.  అయితే.. లంచం డిమాండ్ చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ..  డిపార్ట్‌మెంట్ ఉద్యోగుల ముందే చెయ్యి చేసుకోవ‌డం ఏంటని ఎంపీ పై విమర్శలు వస్తున్నాయి.