
బీజేపీకి తెలిసినంతగా రాజకీయం చేయడం ఎవరి తరం కాదని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ తెలిపారు. కొందరు మీడియా మిత్రులు కావాలనే పనిగట్టుకొని కాంగ్రెస్ పార్టీని, బీఆర్‌ఎస్ పార్టీని పైకి ఎగదోసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షునిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేడు(2023 జూలై 21) బాధ్యతలు స్వీకరించారు. ఆ సమావేశంలో పాల్గొన్న ధర్మపురి అరవింద్.. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా బీజేపీ ప్రభుత్వం సునామీ సృష్టిస్తుందని తెలిపారు. కుటుంబ పాలనను వ్యతిరేకించిన ధర్మపురి అరవింద్.. శివసేన, ఎన్సిపీ కుటుంబ రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టే విచ్ఛిన్నం అయ్యాయని పేర్కొన్నారు. ఇక ఈటల రాజేందర్ గజ్వేల్‌లో పోటీ చేయడం గురుంచి మాట్లాడిన ఆయన.. దమ్ముంటే కేసీఆరే హుజురాబాద్‌లో పోటీ చేయాలని తెలిపారు.