- బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో పాలన పూర్తిగా గాడి తప్పిందని.. ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ అట్టర్ ఫ్లాప్ అయ్యిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. బుధవారం ఆమె బీజేపీ స్టేట్ ఆఫీసులో మాట్లాడారు. రాష్ట్ర ఖజానాను కొల్లగొట్టేలా కాంగ్రెస్ పాలన నడుస్తోందని, సీఎం నుంచి మంత్రుల దాకా అందరూ దోచుకో, దాచుకో పద్ధతిని అనుసరిస్తున్నారని ఆరోపించారు. మంత్రుల మధ్య పంపకాల పంచాయతీలు నడుస్తున్నాయని చెప్పారు. హామీలు అమలు చేయని కాంగ్రెస్‌కు ఓట్లు అడిగే హక్కు లేదన్నారు.
