రాష్ట్రానికి అన్నీ కేంద్రమే ఇస్తే ఇక మీరెందుకు?..రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ గోడం నగేశ్ ఫైర్

రాష్ట్రానికి అన్నీ కేంద్రమే ఇస్తే ఇక మీరెందుకు?..రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ ఎంపీ గోడం నగేశ్ ఫైర్

హైదరాబాద్, వెలుగు: నిరుడు పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేశ్ విమర్శించారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. అన్నీ కేంద్రమే ఇస్తే రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పాలన ఎందుకని ప్రశ్నించారు. తక్షణమే రైతులకు నష్టపరిహారం చెల్లించాలని  డిమాండ్ చేశారు. 

రైతులపై కాంగ్రెస్  నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన పైసలను వాడుకోలేని చేతగాని దద్దమ్మలని ఫైరయ్యారు. మళ్లీ కేంద్రంపై నెపం వేస్తున్నారని ధ్వజమెత్తారు. విపత్తు నిధులు రాష్ట్రం వద్ద రూ.1,911 కోట్లు ఉన్నాయని, ఈ సంగతి మర్చిపోయారా? అంటూ ప్రశ్నించారు.