
బీజేపీ ఎంపీ జీవీఎల్ నర్సింహారావు పొత్తులపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ పొత్తులపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. పొత్తుల అంశం బీజేపీ జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటుందన్న ఆయన.. ఎన్నికల సందర్భంలో పొత్తులపై నిర్ణయం ఉంటుందన్నారు.. అధికార పార్టీ నేతలు మాపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవుపలికారు. ఏదేమైనా బీజేపీ నిర్ణయం లేటైనా లేటెస్ట్ గా ఉంటుందని చెప్పుకొచ్చారు జీవీఎల్.
ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు అంతా ఎన్నికల పొత్తుల గురించే చర్చ సాగుతోంది.. వైసీపీ సింగిల్‌గా బరిలోకి దిగేందుకు సిద్ధం కాగా.. బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన.. అనూహ్యంగా.. టీడీపీతో జత కట్టింది.. అయితే, బీజేపీ స్టాండ్ పై మాత్రం ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ, లెఫ్ట్‌పార్టీలు.. అంటే ఇండియా కూటమి కలిసే పోటీ చేస్తే ఎలా ఉంటుందనే చర్చలు కూడా సాగుతున్నాయి..