న్యూఢిల్లీ, వెలుగు: ఎన్నికల ముందు నిరుద్యోగులకిచ్చిన 2 లక్షల ఉద్యోగాల హామీ, ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్‌పై కాంగ్రెస్ ప్రభుత్వం మాట తప్పిందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ విమర్శించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. నిరుద్యోగులకు ఇచ్చిన ఉద్యోగాల హామీపై సీఎం రేవంత్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఫీజు రీయింబ ర్స్‌మెంట్, ఉద్యోగాల భర్తీపై పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. తమ హక్కుల కోసం పోరాడుతున్న ఉస్మానియా, కాకతీయ వర్సిటీల విద్యార్థులపై లాఠీచార్జ్ చేస్తే కాంగ్రెస్‌కు తగిన గుణపాఠం తప్పదన్నారు. పేపర్ లీకేజీల నివారణకు ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే కేంద్రం కఠిన చట్టం తీసుకువస్తోం దని తెలిపారు. నీట్ పేపర్ లీకేజీపై సీబీఐ దర్యాప్తు వేగంగా సాగుతోందని, 13 మందిని అరెస్ట్ చేశారని పేర్కొన్నారు.
