బీజేపీలో నన్ను ఫుట్ బాల్ ఆడుకుంటున్నరు.. సొంత పార్టీ నేతలపై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం

బీజేపీలో నన్ను ఫుట్ బాల్ ఆడుకుంటున్నరు.. సొంత పార్టీ నేతలపై ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్: బీజేపీ ఆఫీసులో కీలక  పరిణామం చోటు చేసుకుంది. బీజేపీ రాష్ట్ర వ్యవహరాల ఇన్ చార్జి చంద్రశేఖర్ తివారికి చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఫుట్ బాల్ ను గిఫ్ట్ గా పంపి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. పార్టీలో తనను ఫుట్ బాల్ ఆడు కుంటున్నారని ఆవేదనన వ్యక్తం చేశారు. 

రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో పార్టీ వ్యవహరంపై కొండా ఆగ్రహంతో ఉన్నారు. ఈ విషయమై చంద్రశేఖర్ తివారిని కలిస్తే రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును కలువమన్నారని అన్నారు. ఆయనను కలిస్తే అభయ్ పాటిల్ వద్దకు వెళ్లమన్నారని చెప్పారు. అభయ్ పాటిల్ వద్దకు వెళ్తే ఆయన ఇంకొకరి పేరు చెప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుల తీరు, పార్టీ కార్యక్ర మాల సమన్వయలోపంపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేశారు.