కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు

కేసీఆర్ అత్యంత అవినీతిపరుడు

యాదాద్రి, వెలుగు: రాష్ట్రంలోని అవినీతి, అక్రమ, నియంతృత్వ కేసీఆర్​ పాలనను కూకటివేళ్లతో పెకలిస్తామని, త్వరలోనే మోడీ, యోగి జోడీ తరహా పాలనను తెలంగాణ ప్రజలు చూస్తారని రాజ్యసభ సభ్యుడు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్​ అన్నారు. యూపీ నుంచి బుల్డోజర్​ వస్తోందని, కేసీఆర్​ దోచుకున్న అక్రమాస్తులను కూల్చేసి, స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఆదివారం యాదగిరిగుట్టలో లక్ష్మీ నర్సింహస్వామిని లక్ష్మణ్​ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత భువనగిరిలో ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు ఆలె భాస్కర్​రాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్​రావు ఆధ్వర్యంలో జరిగిన ‘కుల వృత్తుల చైతన్య సదస్సు’లో ఆయన మాట్లాడారు. తనను రాజ్యసభకు ఎంపిక చేయడంపై ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. తనకు దక్కిన గౌరవాన్ని పార్టీ కార్యకర్తలకు అంకితం ఇస్తున్నట్లు చెప్పారు.

అహ నా పెళ్లంట సినిమాలా కేసీఆర్​ పాలన

కేసీఆర్​ అత్యంత అవినీతిపరుడు, అబద్ధాలకోరని లక్ష్మణ్ ఆరోపించారు. అరచేతిలో వైకుంఠం చూపి రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసి, చివరకు జీతాలు కూడా ఇవ్వలేని స్థాయికి తెచ్చారని మండిపడ్డారు. ‘‘కేసీఆర్​ పాలన ‘అహ నా పెళ్లంట’సినిమాలా ఉంది. ఆ సినిమాలో కోడిని పైకప్పుకు కట్టిన కోటా శ్రీనివాసరావు దాన్ని చూస్తూ చికెన్​తో భోజనం చేసినట్టుగా ఫీలవుతాడు. అట్లనే ఎర్రవల్లిలో ఇండ్లు కట్టిన కేసీఆర్, అందరికీ ఇండ్లు కట్టిస్తానని చెప్పి, ఓట్లు వేయించుకున్నాడు. కేసీఆర్​ రెండోసారి గెలిచిన తర్వాత కూడు, గూడు, జాబు లేకుండా పోయాయి”అని అన్నారు. కేంద్రం పథకాలను చూపిస్తూ కేసీఆర్​ సోకులు పడ్తున్నారని విమర్శించారు.

మరిన్ని వార్తల కోసం...

ఆగని ‘నకిలీ’ దందా

సర్పంచ్‌‌‌‌లైతే కూలికి పోకూడదా?