మన దగ్గర మస్తు బంగారం .. భారతీయుల పసిడి విలువ రూ.462 లక్షల కోట్లు

మన దగ్గర మస్తు బంగారం .. భారతీయుల పసిడి విలువ రూ.462 లక్షల కోట్లు

న్యూఢిల్లీ: మనదేశంలోని కుటుంబాల వద్ద ఉన్న బంగారం నిల్వలు ప్రపంచంలోని టాప్–10 దేశాల కేంద్ర బ్యాంకుల నిల్వలను మించిపోయాయని అసోచామ్ వెల్లడించింది. దీని రిపోర్ట్​ ప్రకారం.. మన ఇండ్లలో ఉన్న బంగారం విలువ ఐదు ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.462.25 లక్షల కోట్లు) చేరుకుంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రైవేట్ సంపద నిల్వల్లో ఒకటిగా నిలిచింది. 

ఈ బంగారం నిల్వల్లో కేవలం 2 శాతం నిధులు ఆర్థిక వ్యవస్థలోకి చేరితే దేశ వృద్ధి వేగంగా పెరుగుతుంది. 2047 నాటికి భారత జీడీపీ 34 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా వేయగా, ఈ బంగారం తోడ్పాటుతో అది 40 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ సంపదలో ఎక్కువ భాగం ఆర్థిక వ్యవస్థ బయటే ఉంది. దీనిని ఉత్పాదక రంగాల్లోకి మళ్లించడానికి గోల్డ్ మానిటైజేషన్ పథకాలు అవసరమని రిపోర్ట్​ పేర్కొంది. గోల్డ్ లోన్లు కూడా భారీగా పెరిగాయి. 2025 నవంబర్ నాటికి బంగారంపై రుణాల విలువ రూ.24.34 లక్షల కోట్లకు చేరింది.