గచ్చిబౌలి, వెలుగు: డిన్నర్ పేరుతో సాఫ్ట్వేర్ ఉద్యోగినిని తన ఇంటికి పిలిపించుకొని ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ కంపెనీ మేనేజర్కు 20 ఏండ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ రంగారెడ్డి జిల్లా సెషన్స్ కోర్టు సంచలన తీర్పునిచ్చింది. సైబరాబాద్ క్రైమ్ డీసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. మాదాపూర్ఇజ్జత్నగర్లోని ఆదిత్య సన్షైన్అపార్ట్మెంట్లో నివాసం ఉండే వివేక్ నటాని(47) ఓ ఐటీ కంపెనీలో మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఇదే కంపెనీలో కొండాపూర్‌కు చెందిన యువతి సాఫ్ట్వేర్ఉద్యోగం చేస్తుంది. 2018 ఫిబ్రవరి 2న రాత్రి డిన్నర్పేరుతో వివేక్యువతిని తన ఇంటికి తీసుకువెళ్లాడు.
తిన్న తర్వాత మాట్లాడుకుందామని చెప్పి యువతిపై అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. దీంతో బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. పూర్తిస్థాయి విచారణ అనంతరం న్యాయమూర్తి వాణి నిందితుడిని దోషిగా నిర్ధారించి, 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా, బాధితురాలికి 3 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని శుక్రవారం తీర్పు వెల్లడించారు. ఈ కేసులో పకడ్బందీగా ఆధారాలు సేకరించిన పోలీసు యంత్రాంగాన్ని డీసీపీ అభినందించారు.
పోక్సో కేసులో వృద్ధుడికి ఏడేండ్లు..
కూకట్‌పల్లి, వెలుగు: కేపీహెచ్‌బీ ఆదిత్యనగర్‌లో మైనర్ బాలికపై లైంగిక దాడికి యత్నించిన కందుల సుబ్బారావు (76) అనే వృద్ధుడికి కూకట్‌పల్లి స్పెషల్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏడేండ్ల జైలు శిక్ష విధించింది. 2023లో నమోదైన ఈ పోక్సో కేసును జడ్జి ఎం.వెంకటేశ్వరరావు విచారించారు. నిందితుడికి జైలు శిక్షతో పాటు రూ. 30 వేల జరిమానా విధిస్తూ శుక్రవారం తీర్పు వెలువరించారు.
