
కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే టీఆర్ఎస్ పార్టీకి వేసినట్లేనని బీజేపీ నేత, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ అన్నారు. ‘‘గత ఎన్నికల్లో చెల్లని రూపాయి ప్రభాకర్ రెడ్డి.. అలాంటి వ్యక్తి ఈ ఉపఎన్నికల్లో ఎలా గెలుస్తాడు’’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీకి ఎక్కడా క్యాడర్ లేదని ఎద్దేవా చేశారు. మునుగోడును కేటీఆర్ దత్తత తీసుకుంటానని అనడం విడ్డూరంగా ఉందని, మరి టీఆర్ఎస్ అభ్యర్థి దద్దమ్మనా అని లక్ష్మణ్ ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు, విద్యార్థులు, టీచర్లు అధికార పార్టీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని లక్ష్మణ్ అన్నారు. దుబ్బాక, హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను ఓడించినట్లు మునుగోడులో కూడా ఆ పార్టీని ఓడించాలని ఓటర్లకు లక్ష్మణ్ పిలుపునిచ్చారు.
దుబ్బాక, హుజూరాబాద్ లలో టీఆర్ఎస్ ను ఓడించినట్లు మునుగోడులో కూడా ఆ పార్టీని ఓడించాలని ఓటర్లకు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ పిలుపునిచ్చారు. ఉప్పల్, ఎల్ బీ నగర్ ప్రాంతాల్లో ఉండే మునుగోడు ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆయన కాంగ్రెస్ పార్టీ కపట నాటకం ఆడుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ గెలుపు కోసం ప్రయత్నం చేస్తోందన్నారు.