సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేసిండు : ఎంపీ లక్ష్మణ్

సీఎం కేసీఆర్ బీసీలను మోసం చేసిండు : ఎంపీ లక్ష్మణ్

ప్రధాని మోడీ అభినవ పూలే అని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు. జోతిరావ్ పూలే వర్ధంతి సందర్భంగా లక్ష్మణ్ ఆయనకు నివాళులు అర్పించారు. సమాజంలో మార్పు కోసం పూలే కుటుంబం ఎంతో కృషి చేసిందన్నారు. జ్యోతిరావ్ పూలే ఆశయాలకు అనుగుణంగా మోడీ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు.

మోడీ తన కేబినెట్లో 70శాతం మంత్రి పదవులు అణగారిన వర్గాలకు కేటాయించారని లక్ష్మణ్ తెలిపారు. బీసీ కమిషన్కు రాజ్యాంగ హోదా కల్పించారన్నారు. కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే పదవులు ఇచ్చుకున్నాడని విమర్శించారు. జనాభాలో అధికశాతం ఉన్న బీసీలకు మూడు మంత్రి పదవులిచ్చి వారిని మోసం చేశారని మండిపడ్డారు. మోడీకి కేసీఆర్కు చాలా తేడా ఉందన్నారు.