కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు

కేసీఆర్ పచ్చి అబద్ధాలకోరు

హైదరాబాద్: కేసీఆర్ పెద్ద అబద్ధాలకోరు అని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. సోమవారం బీజేపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ లో రైతు దీక్ష చేశారు. ఈ సందర్భంగా వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ... కేసీఆర్ కు కమిషన్ల మీద ఉన్న ధ్యాస ప్రజల మీద లేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సీఎం కేసీఆర్ తన తుగ్లక్ పాలనతో రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని విమర్శించారు. పాకిస్థాన్, శ్రీలంక దేశాల అప్పుల కంటే తెలంగాణ అప్పులే ఎక్కువని స్పష్టం చేశారు. 

దుబ్బాక, హుజురాబాద్, జీహెచ్ఎంసీ ఎన్నికలతో టీఆర్ఎస్ పతనం ప్రారంభమైందన్నారు. మొన్నటి నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఘన విజయంతో కేసీఆర్ లో వణుకు మొదలైందని, దీంతో పీకేను పిలిపించుకొని సర్వే చేయించుకున్నారన్నారు. పీకే సర్వే ఫలితాలు తెలుసుకున్న కేసీఆర్.. షాక్ కు గరయ్యారన్నారు. టీఆర్ఎస్ కు 3 ఎంసీ సీట్లు, 22కు మించుకుండా అసెంబ్లీ సీట్లు వస్తాయని పీకే సర్వేలో తేలిందన్నారు. అందుకే కేసీఆర్ వరి డ్రామాలాడుతున్నారని చెప్పారు. ఏనాడు ప్రతిపక్షాలకు అపాయిట్మెంట్ ఇవ్వని కేసీఆర్.. మోడీ తనకు అపాయిట్మెంట్ ఇవ్వడంలేదని చెబుతుంటే నవ్వొస్తుందన్నారు. కేసీఆర్ ఎన్ని డ్రామాలాడినా తెలంగాణలో బీజేపీ ఎదుగుదలను ఆపలేరన్నారు. 

మరిన్ని వార్తల కోసం...

తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు?

అన్నదాతల భూములు అమ్మాలని కేంద్రం యత్నం