తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు?

తెలంగాణ రైతులు ఏం పాపం చేశారు?

ధాన్యం కొనుగోలుపై కేంద్రం వ్యవహరిస్తున్న తీరును ఢిల్లీ వేదికగా సీఎం కేసీఆర్ ఎండగట్టారు. ఎన్నికలు వస్తేనే ప్రధాని నరేంద్ర మోడీకి రైతులు గుర్తుకువస్తారని.. ఆ తర్వాత వారిని పట్టించుకోరని విమర్శించారు. తెలంగాణ రైతులు ఏం పాపం చేశారని..వారికి న్యాయం చేసే వరకు పోరాటం ఆపేది లేదని చెప్పారు. యాసంగి వడ్లను కొనుగోలు చేయాలని ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ను అడిగితే తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా వ్యాఖ్యలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ దేశానికి కొత్త వ్యవసాయ పాలసీ తీసుకురావాలని కోరారు. బాయిల్డ్ రైస్, రా రైస్ ఏదైనా కేంద్రం కొనుగోలు చేస్తుందని బండి సంజయ్ చెప్పారని గుర్తు చేశారు.ఇప్పుడు మాట మార్చి రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు.

ధాన్యం కొనడానికి కేంద్రం దగ్గర డబ్బులు లేవా? మోడీకి మనస్సు లేదా అని ప్రశ్నించారు. అసలే కష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న రైతుల మోటార్లకు మీటర్లు పెట్టడమేనా బీజేపీ పద్ధతి అని సూటిగా ప్రశ్నించారు. రైతులతో పెట్టుకుంటే మోడీ తట్టుకోలేరని హెచ్చరించారు. బీజేపీని వ్యతిరేకించి మాట్లాడితే ఈడీ, సీబీఐ, ఐటీ దాడులు చేయిస్తారా అని ప్రశ్నించారు. ఇదేనా బీజేపీ పద్ధతి అని మండిపడ్డారు. వడ్ల కొనుగోలుపై కేంద్రం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే 24 గంటల తర్వాత ఏం చేయాలో నిర్ణయిస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు. 

మరిన్ని వార్తల కోసం

ట్విట్టర్​ నుంచి ఎడిట్​ ఫీచర్​

నాన్ వెజ్ విషయంలో కొట్టుకున్న జేఎన్యూ స్టూడెంట్లు