బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పెరుగుతోన్న ఆదరణ: జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్

బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులకు పెరుగుతోన్న ఆదరణ: జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్

నిర్మల్, వెలుగు: ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్, టీచర్  ఎమ్మెల్సీ ఎన్నికల్లో  బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్, తెలంగాణ సంఘటన మంత్రి చంద్రశేఖర్ తివారీ కోరారు. గురువారం నిర్మల్‌లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు అంజుకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు.

టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య,  గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డికి గ్రాడ్యుయేట్, టీచర్ ఓటర్ల నుంచి విశేష ఆదరణ లభిస్తోందన్నారు.  బీజేపీపై ప్రజల్లో విశ్వాసం పెరిగిందన్నారు. ఇతర పార్టీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమరయ్య, ఎంపీ నగేశ్, ఎమ్మెల్యేలు మహేశ్వర్ రెడ్డి, రామారావు పటేల్, పాల్వాయి హరీశ్ బాబు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్‌ఎస్ ప్రభాకర్, చింతల రామచంద్రారెడ్డి, 4 జిల్లాల అధ్యక్షులు అసెంబ్లీ నియోజ కవర్గాల బాధ్యులు, ప్రభారీలు పాల్గొన్నారు. 

మా ఓటు మల్క కొమరయ్యకే ..
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మల్క కొమరయ్య కు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు అయినేని సంతోష్ కుమార్ కోరారు.  కరీంనగర్ లో  తెలంగాణ స్కూల్స్ టెక్నికల్ కాలేజెస్ అధ్యాపకులతో సమావేశం అయ్యారు. మల్క కొమరయ్యకే  ఓటు వేస్తామని అధ్యాపకులు తెలిపారు. అధ్యాపకులు పాల్గొన్నారు.