మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ గ్రాఫ్ దిగజారుతది

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత కేసీఆర్ గ్రాఫ్ దిగజారుతది

మునుగోడు ఉప ఎన్నిక తర్వాత సీఎం కేసీఆర్ గ్రాఫ్ మరింతగా దిగజారుతుందని బీజేపీ జాతీయ నేత వివేక్ వెంకటస్వామి అన్నారు. మునుగోడులో అమిత్ షా మీటింగ్ తర్వాత మార్పు వస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఉప ఎన్నిక వస్తేనే సీఎం కేసీఆర్కు నియోజకవర్గం గుర్తుకు వస్తుందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఓట్లేసిన ప్రజలను కేసీఆర్ మర్చిపోతారని విమర్శించారు.

కమీషన్లతో కల్వకుంట్ల కుటుంబం లక్షల కోట్లు సంపాదిస్తోందని వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో భారీగా అవినీతి జరిగిందన్నారు. కేంద్రమంత్రే స్వయంగా కాళేశ్వరం ప్రాజెక్టుపై స్పందిస్తూ అక్రమాలు జరిగాయని చెప్పడం ఇందుకు నిదర్శనమన్నారు. కుటుంబ పాలనలో తెలంగాణ రాష్ట్రం బందీ అయిందని వివేక్ వెంకటస్వామి మండిపడ్డారు. ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించామన్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా కూడా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు.