17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని ఎట్లైతడు?: డీకే అరుణ

17 సీట్లు గెలిస్తే రాహుల్ ప్రధాని ఎట్లైతడు?: డీకే అరుణ
  • బీఆర్ఎస్పై ద్వేషంతోనే కాంగ్రెస్ కు అధికారం
  • ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే  తప్పుడు ప్రచారాలు
  • బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

 జగిత్యాల: రాష్ట్రంలో17 సీట్లు ఎంపీ సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని ఎట్లైతడు? అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీల మధ్య పొత్తు లేదని.. ఎప్పటికీ ఉండదని స్పష్టంచేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు కాంగ్రెస్ లీడర్లు తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు.

  జగిత్యాల జిల్లా మెట్​పల్లిలో అరుణ మీడియాతో మాట్లాడుతూ ‘బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య లోపాయికారీ ఒప్పందం ఉంది. 17 ఎంపీ సీట్లు గెలిస్తేనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి అంటున్నడు. 17 సీట్లు గెలిస్తే రాహుల్ గాంధీ ప్రధాని ఎట్లైతడు? బీఆర్ఎస్ పై ద్వేషంతోనే  ప్రజలు కాంగ్రెస్ కు అధికారమిచ్చారు. లిక్కర్ కేసులో కవిత జైలుకు వెళ్లడం పక్కా.  ఆమె అరెస్టుకు బీజేపీకి ఎలాంటి సంబంధం లేదు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ 12 స్థానాల్లో గెలుస్తుంది’ అని అరుణ ఆశాభావం వ్యక్తంచేశారు.