
కరీంనగర్లో పర్యటించారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్, పందిళ్ల సర్పంచ్ పొన్నమనేని దేవేందర్ కూతురి వివాహం రేకుర్తిలో జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరై వధువరులను ఆశీర్వదించారు వివేక్ వెంటస్వామి. నటరాజ్ కన్వెన్షన్ లో జరిగిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి సోదరుడి కొడుకు వివాహానికి హాజరయ్యారు. అలాగే కరీంనగర్ లోని ప్రైవేట్ హాస్పిటలో పక్షవాతానికి గురై చికిత్స పొందుతున్న యాదవ సంఘం అధ్యక్షుడు చంద్ర శేఖర్ ను వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.