గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్ : కేజ్రీవాల్

గుజరాత్ ఎన్నికల నుంచి తప్పుకోవాలని బీజేపీ ఆఫర్ : కేజ్రీవాల్

బీజేపీపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నుంచి తప్పుకుంటే.. ఢిల్లీ మంత్రులు సత్యేంద్ర జైన్, మనీష్ సిసోడియాలపై ఉన్న కేసులను తొలగిస్తామని ఆఫర్ చేసినట్లు చెప్పారు. ఈ ఆఫర్ ఇచ్చిన వ్యక్తి పేరును కేజ్రీ వెల్లడించలేదు.

‘‘ఆప్ను వీడితే ఢిల్లీ సీఎం పదవి ఇస్తామన్న ఆఫర్ను మనీష్ సిసోడియా తిరస్కరించిన తర్వాత వారు నన్ను సంప్రదించారు. గుజరాత్ ఎన్నికల్లో పోటీచేయకుండా తప్పుకుంటే సిసోడియా, సత్యేంద్ర జైన్లపై ఉన్న కేసులను ఎత్తేస్తామని ఆఫర్ చేశారు. బీజేపీ నేరుగా సంప్రదించదు. సొంత పార్టీ నేతల ద్వారనే ఈ ఆఫర్ వచ్చింది’’  అని కేజ్రీవాల్ చెప్పారు. 

ఢిల్లీలోని ఎంసీడీ సహా గుజరాత్ ఎన్నికల్లో ఓడిపోతామనే భయాందళనలో బీజేపీ ఉన్నట్లు కేజ్రీవాల్ విమర్శించారు. అందుకే రెండు ఎన్నికలు ఒకేసారి నిర్వహిస్తున్నారన్నారు. బీజేపీ ఎన్ని కుట్రలు చేసిన గుజరాత్ లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష స్థానంలో ఉన్న కాంగ్రెస్కు ఐదు కంటే తక్కువ సీట్లు వస్తాయని జోస్యం చెప్పారు.