MIM పాకిస్తానీ పార్టీ : ఎంపీ అర్వింద్

MIM పాకిస్తానీ పార్టీ : ఎంపీ అర్వింద్

నిజామాబాద్ మేయర్ గా మహిళ : ఎంపీ అర్వింద్
కేసీఆర్ ఇండ్లు, ఉద్యోగాలు ఇవ్వలేదు
మోడీ దెబ్బకు ఓవైసీ చేతిలో జాతీయ జెండా
నిజామాబాద్ పేరు మారుస్తాం

ఓవైసీకి నేను బాప్ ను కాను… బావను: రాజాసింగ్

నిజామాబాద్ : భైంసా ఘటనకు నిరసనగా నిజామాబాద్ లో శాంతి ర్యాలీ నిర్శహించారు బీజేపీ నాయకులు, ఎంపీ అర్వింద్. ఈ ర్యాలీలో గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పాల్గొన్నారు. రాజాసింగ్ మాట్లాడుతూ… సీఎం కేసీఆర్ ప్రతీ ఒక్కరికి ఉద్యోగం ఇస్తానని, డబల్ బెడ్ రూం ఇల్లు కట్టిస్తానని చెప్పి… ఇప్పటి దాకా ఒక్కరికి కూడా ఉద్యోగాం ఇవ్వలేదని అన్నారు. కేసీఆర్ అబద్దాలపుట్టగా తయారయ్యారని… కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్ర ప్రజలకు చెందకుండా అడ్డుకుంటున్నారని చెప్పారు.

బీజేపీ అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గౌరవం పెరిగిందని అన్నారు రాజాసింగ్. ఇందుకు ప్రపంచదేశాలు తమతో ఉన్న సఖ్యతనే నిదర్షనమని చెప్పారు. మోడీ దెబ్బకు ఓవైసీకూడా జాతీయజెండా పట్టుకు తిరుగుతున్నాడని… ఎప్పుడూ లేనిది తాముకూడా దేశంలో భాగమని అంటున్నాడని అన్నారు.  గతంలో పాతబస్తీలో జాతీయ జెండా కానీ, జనగనమన పాడేవారు కాదని.. ఇప్పుడు ప్రతీ ఒక్కరూ జాతీయ జెండా పట్టుకుతిరుగుతున్నరని చెప్పారు. అయితే ర్యాలీలో పాల్గొన్న జనం రాజాసింగ్ మాట్లాడుతున్నప్పుడు… ఆయారే ఆయా ఒవైసీ కా బాప్ ఆయా అని అన్నారు.. అందుకు రాజాసింగ్ వారించి… తాను ఓవైసీకి బాప్ కానని ఆయనకు తాను బావనని చెప్పారు. అది ఓవైసీ కూడా ఒప్పుకున్నాడని తెలిపారు.

నిజామాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాదించి.. మేయర్ ను ఏర్పాటు చేసుకున్నాక నిజామాబాద్ పేరు మారుస్తామని చెప్పారు రాజాసింగ్. నిజామాబాద్ పేరు గతంలో ఇందూర్ గా.. ఉండేదని నిజాం నిరంకుశ పాలనలో అది నిజామాబాద్ గా మార్చారని తెలిపారు. నిజాం పాలనలో మహిళలను, ప్రజలను చిత్రహింసలకు గురిచేశారని.. అందుకు గుర్తుగా ఉన్న నిజామాబాద్ పేరు మనకెందుకని అన్నారు.

నిజామాబాద్ మేయర్ గా మహిళ : అర్వింద్

MIM పార్టీ ఓ పాకిస్తానీ పార్టీ అని అన్నారు నిజామాబాద్ ఎంపీ దర్మపురి అర్వింద్. ర్యాలీ లో మాట్లాడిన ఆయన.. ముస్లింలు కూడా తమవాళ్లేనని అయితే.. అసదుద్దీన్ ఓవైసీది ముస్లింల పార్టీ అయితే తమకేం అభ్యంతరం లేదని.. కానీ.. ఓవైసీది పాకిస్తానీ పార్టీ అని ఆయన అన్నారు.  నిజామాబాద్ మున్సిల్ ఎన్నికలల్లో బీజేపీని గెలిపించి పాకిస్తాన్ పార్టీ అయిన MIM ను ఓడగొట్టాలని అరవింద్ పిలుపునిచ్చారు. ప్రతీ వార్డుకు బలమైన ప్రత్యర్థులను బీజేపీ నిలిపిందని… మహిళలో ప్రతీ మహిళా క్యాండిడేటు ఓ ఘాన్సీ లక్ష్మీ బాయి అని… ప్రతీ మేల్ క్యాండిడేటు నరేంద్ర మోడీ అని అన్నారు.

ఓ ముల్లా ముఖ్యమంత్రికి ఒక కొడుకున్నాడని ఆయన భారత దేశం మత ప్రతిపాదికన విభజించారా అని ప్రశ్నించాడని అన్నారు అర్వింద్. ఈ ముల్లా ముఖ్యమంత్రి 80వేల పుస్తకాలు చదివానని చెప్పుకున్నాడని… అందులో సగమైనా జ్ఞానం కొడకుకు ఇవ్వలేదని చెప్పారు. దేశం విభజించినపుడు పాకిస్తాన్, బంగ్లాదేశ్ అనే రెండు దేశాలను ముస్లింలకు ఇచ్చామని చెప్పారు. అయినా పౌరసత్వం చట్టంతో బీజేపీ ముస్లింలకు ఏమీ అన్యాయం చేయలేదని.. కొంచెం చట్టం చదివి మాట్లాడాలని చెప్పారు అర్వింద్.

ఓవైసీ వస్తున్నడు.. కాబట్టి రాజాసింగ్ కు పర్మిషన్ ఇవ్వలేం

శుక్రవారం నిజామాబాద్ లో  జరిగిన మున్సిపల్ ఎన్నికల ప్రచార ర్యాలీకి బీజేపీ లీడర్, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ హాజరవాల్సివుండగా.. నగర పోలీస్ కమిషనర్ అందుకు అనుమతులివ్వలేదు. దీంతో  ర్యాలీ జరుగుతుండగానే కమిషనర్ కు ఫోన్ చేసి మాట్లాడారు బీజేపీ నాయకులు, ఎంపీ దర్మపురి అరవింద్. రాజాసింగ్ కు ర్యాలీలో పాల్గొనేందుకు పర్మిషన్ ఎందుకు ఇవ్వలేదని అడిగారు… దీంతో ఓవైసీ నిజామాబాద్ వస్తున్నందున తాము రాజాసింగ్ కు పర్మిషన్ ఇవ్వలేమని కమిషనర్  చెప్పారు. ఓవైసీ వచ్చే టైంలో కాకుండా వేరే టైమ్ లో నైనా రాజాసింగ్ కు పర్మిషన్ ఇవ్వాలని అడిగినా కుదరదని చెప్పారు. దీంతో ఓవైసీ పోలీసులను నడిపిస్తున్నాడా అని అరవింద్ ప్రశ్నించారు. బీజేపీని పోలీసుల చెప్పుచేతల్లోకి తీసుకోవాలనుకుంటే కుదరదని అన్నారు. చివరికి… రూట్ చేంజ్ చేసుకుంటామన్నా  రాజాసింగ్ ర్యాలీలో పాల్గొనేందుకు ఒప్పుకోలేదు పోలీస్ కమిషనర్. మున్సిపల్ ఎలక్షన్స్ లో  బీజేపీ విజయం సాధిస్తుందని రిపోర్ట్ ఉన్నందునే టీఆర్ఎస్ భయపడి పోలీసుల చేత తమ నాయకులను ప్రచారంలో పాల్గొనకుండా చేస్తుందని ఆరోపించారు అరవింద్.

ఇవికూడా చదవండి..

మజ్లిస్​కు 6 మున్సిపాలిటీలు!…TRS​తో MIM అండర్​స్టాండింగ్

లెఫ్ట్ పార్టీల అబద్ధాల ప్రచారం

హిందూ దేశంగా మార్చాలని చూస్తున్నరు

టెర్రరిజం అణచాలంటే అమెరికా పాలసీనే మేలు