పైసలియ్యలేదనే 13 జిల్లాల్లో ట్రాన్స్ఫర్లు ఆపిన్రా : బండి సంజయ్ 

పైసలియ్యలేదనే 13 జిల్లాల్లో ట్రాన్స్ఫర్లు ఆపిన్రా  : బండి సంజయ్ 

బదిలీలు, ప్రమోషన్ల పేరుతో ప్రభుత్వం కొత్త డ్రామా షురూ చేసిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. టీచర్ల బదిలీల్లో అక్రమాలు జరుగుతున్నాయని, టాన్స్ ఫర్ల కోసం బీఆర్ఎస్ నేతలు డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆరోపించారు. పైసలివ్వలేదని 13 జిల్లాల్లో స్పౌజ్ బదిలీలు ఆపారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఉద్యోగులకు ఒకటో తారీఖున ఎందుకు జీతాలు ఇవ్వడం లేదని బండి నిలదీశారు. ఐదేండ్లుగా PRC ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. టీచర్లకు నాలుగు డీఏలు బకాయి ఉన్నారని, ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోవడం ఖాయమని అన్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 317 ను వెంటనే సవరించాలని బీజేపీ చీఫ్ బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఈ  జీవో కారణంగా టీచర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ జీవో ఎందరో టీచర్ల జీవితాలను చిన్నాభిన్నం చేస్తోందన్న ఆయన...  34 మంది ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకున్న విషయాన్ని గుర్తు చేశారు. టీచర్ల  విజ్ఞప్తులను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోని పరష్కరించాలని డిమాండ్ చేశారు.