గూఢచర్యం కేసు.. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్

గూఢచర్యం కేసు.. కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్

ఢిల్లీలో సీఎం కేజ్రీవాల్ ఇంటి ఎదుట బీజేపీ మరోసారి నిరసనకు దిగింది. గూఢచర్యం కేసుపై ఆప్‭కి వ్యతిరేకంగా.. ఐటీఓ నుంచి సచివాలయం వరకు నిరసన ప్రదర్శన చేపట్టింది. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని బీజేపీ ఆందోళన చేసింది. పోలీసులు, నిరసనకారుల్ని అడ్డుకునే ప్రయత్నం చేయడంతో.. ఇరువురి మధ్య తోపుటాల జరిగింది. పలువురు బీజేపీ, నేతలు కార్యకర్తల్ని పోలీసులు అరెస్టు చేశారు.  బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణను ఆప్ ఖండించింది. కావాలనే సిసోడియాపై నిందలు వేస్తున్నారని మండిపడింది. 

బీజేపీ నేతల మాటలను ఆప్ రహస్యంగా వింటుందని బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా పై కేసు నమోదు చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనాను కోరారు. ఆప్ నాయకులు ప్రజల కోసం పని చేయకుండా.. అక్రమంగా గూఢచర్యం చేస్తున్నారని  ఆరోపించారు. అయితే.. బీజేపీ ఆరోపిస్తున్నట్లు మనీష్ సిసోడియా ఎలాంటి గూఢచర్యానికి పాల్పడలేదని ఆప్ నేతలు చెబుతున్నారు. బీజేపీ చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని.. ఈ కేసులన్నీ కావాలని పెట్టినవే అని ఆప్ ఆరోపించింది.